బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ది ప్రెస్టీజియస్ మైథలాజికల్ చిత్రం ‘రామాయణ’ యావత్ దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నమిత్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ భారీ చిత్రంలో రాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్, సీత పాత్రలో సాయి పల్లవి నటిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.
అయితే, ఈ సినిమాను దీపావళి 2026 కానుకగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్‌ను జూలై 18న రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సినిమాకాన్ ఫెస్టివల్‌లో ఈ ట్రైలర్‌ను ప్రదర్శించారు. దీంతో ఇప్పుడు ఈ ట్రైలర్‌ను అధికారికంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోందట.
కాగా, ఈ సినిమాలో రావణుడి పాత్రలో యష్, లక్ష్మణుడి పాత్రలో రవి దూబే నటిస్తుండగా నమిత్ మల్హోత్రా ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్ర రెండవ భాగాన్ని 2027 దీపావళి కానుకగా రిలీజ్ చేయాలని మేకర్స్ రెడీ అవుతున్నారు.


