‘బాలయ్య’ సినిమా ఫస్ట్ షెడ్యూల్ అప్పుడే ?

‘బాలయ్య’ సినిమా ఫస్ట్ షెడ్యూల్ అప్పుడే ?

Published on Jun 14, 2026 12:08 PM IST

Nandamuri-Balakrishna

నటసింహం బాలయ్య బాబు – కొరటాల శివ కాంబినేషన్‌లో సినిమా రాబోతుంది. పైగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన బాలకృష్ణ సరికొత్త మేకోవర్‌లో కనిపించబోతున్నాడు. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ జులై రెండో వారం నుంచి స్టార్ట్ చేయనున్నారు. ముందుగా తీయనున్న యాక్షన్ సీన్స్ కోసం ఓ భారీ సెట్ వేస్తున్నారట. ఇక ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని జూన్ 25న అమరావతి సమీపంలోని వెంకటాయపాలెంలో ఉన్న టీటీడీ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో అత్యంత ఘనంగా ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందట.

కాగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ లు ఈ చిత్ర ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేయనున్నారు. అన్నట్టు ఈ సినిమాలో బాలయ్య బాబు పాత్ర మాఫియా నేపథ్యంలో ఉంటుందట. అలాగే, ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా ఉంటాయని తెలుస్తోంది. స్టోరీ కూడా ప్రత్యేకంగా ఉంటుందట. దేవర తర్వాత కొరటాల శివ చేస్తున్న సినిమా కావడంతో.. కథ పై కొరటాల బాగా కసరత్తులు చేశారట. కాగా సుధాకర్ చెరుకూరి మరియు సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు