లేటెస్ట్ గా టాలీవుడ్ నుంచి రిలీజ్ కి వచ్చిన అవైటెడ్ సినిమానే ది ప్యారడైజ్. నాచురల్ స్టార్ నాని హీరోగా గ్లామరస్ డాల్ కయాదు లోహర్ హీరోయిన్ గా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన సాలిడ్ ఎమోషనల్ యాక్షన్ డ్రామా ఉన్న హైప్ లో మిక్స్డ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది.
అయితే ఫైనల్ గా ఈ సినిమా మొదటి వీకెండ్ లో సాలిడ్ వసూళ్లతో 150 కోట్లకి పైగా గ్రాస్ అలాగే మంచి బుకింగ్స్ సొంతం చేసుకున్న ఈ సినిమా అసలు సిసలు రోజు సోమవారం వర్కింగ్ డేకి వచ్చింది. అయితే ఈ టెస్ట్ లో ప్యారడైజ్ సినిమా యావరేజ్ పెర్ఫామ్ చేసింది అని చెప్పొచ్చు. బుక్ మై షో బుకింగ్స్ లో మొదటి సోమవారం ఈ సినిమా కేవలం 70 వేలకి టికెట్స్ కి పైగా సేల్ చేసుకుంది.
ఇక డిస్ట్రిక్ట్ లో కలిపి ఒక లక్ష 13 వేలకి పైగా సేల్ చేసుకుంది. సో మొదటి సోమవారం ప్యారడైజ్ కి మరీ ఎక్కువా కాదు అలా అని మరీ తక్కువా కాకుండా డీసెంట్ హోల్డ్ తో పెర్ఫామ్ చేసింది అనుకోవచ్చు. ఇక ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందించగా సుధాకర్ చెరుకూరి నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.


