వరల్డ్ వైడ్ ‘ది ప్యారడైజ్’ 5 రోజుల వసూళ్లు ఎంతంటే!

వరల్డ్ వైడ్ ‘ది ప్యారడైజ్’ 5 రోజుల వసూళ్లు ఎంతంటే!

Published on Sep 29, 2026 10:59 AM IST

టాలీవుడ్ స్టార్ హీరో నాచురల్ స్టార్ నాని హీరోగా కయాదు లోహర్ హీరోయిన్ గా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన లేటెస్ట్ సినిమానే ది ప్యారడైజ్. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా నాని కెరీర్ లోనే సెన్సేషనల్ ఓపెనింగ్స్, రికార్డ్ వీకెండ్ వసూళ్లు రాబట్టి తన కెరీర్ లో బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.

ఇక ఇలా వరల్డ్ వైడ్ గా మొత్తం 5 రోజుల రన్ ని సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది. అయితే ఈ సినిమా 5వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 10 కోట్ల గ్రాస్ ని అందుకున్నట్టు పి ఆర్ లెక్కలు చెబుతున్నాయి. ఇక ఈ 10 కోట్ల గ్రాస్ తో సినిమా మొత్తం 5 రోజుల్లో 165 కోట్ల మార్కుని సొంతం చేసుకొని 200 కోట్ల గ్రాస్ దిశగా దూసుకెళ్తుంది. దీనితో నాని కెరీర్లో ఒక మర్చిపోలేని సినిమాగా ఇది నిలిచింది అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాలో మోహన్ బాబు పవర్ఫుల్ విలన్ రోల్ లో నటించగా రాఘవ జుయల్ మరో కీలక పాత్రలో నటించాడు. అలాగే ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందించాడు.

తాజా వార్తలు