బిజినెస్ మెన్ తో హీరోయిన్ పెళ్ళికి సిద్ధం !

బిజినెస్ మెన్ తో హీరోయిన్ పెళ్ళికి సిద్ధం !

Published on May 3, 2021 9:30 AM IST

సీనియర్ హీరోయిన్ త్రిష పెళ్లికి సంబంధించి ఇప్పటికే చాల రకాలుగా వార్తలు వచ్చాయి. కానీ, వాటిల్లో ఒకటి కూడా నిజం కాలేదు. అయితే, తాజాగా త్రిష పెళ్లి చేసుకోబోతుందని తెలుస్తోంది. తమిళ మీడియా వర్గాల కథనాల ప్రకారం ఈ వార్తకు మరింత బలం చేకూర్చేలా ఉందట త్రిష వ్యవహారం. త్రిష గత కొంత కాలంగా సీరియస్ గా పెళ్లి గురించి థింక్ చేస్తోందట. ఈ క్రమంలో ఆమె ఒక బిజినెస్ మెన్ తో పెళ్ళికి సిద్ధం అయిందని తెలుస్తోంది. మరి ఈ వార్తలో ఎంత నిజం తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకూ ఆగాల్సిందే.

ఒకప్పుడు తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలతో టాప్ హీరోయిన్‌గా కొనసాగిన త్రిష‌కు ప్రస్తుతం పెద్దగా అవకాశాలు అయితే లేవు. అందుకే, కొన్నాళ్ల క్రితమే పెళ్లి చేసుకునేందుకు త్రిష రెడీ అయింది. వ్యాపారవేత్త వరుణ్ మణియన్‌తో ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకుంది. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు గానీ, ఆ పెళ్లి మధ్యలోనే ఆగిపోయింది. ఇక తన పెళ్లి గురించి ఎప్పుడూ త్రిష ప్రస్తావించలేదు. కానీ చాల నెలలు తరువాత త్రిష పెళ్లి అంటూ మళ్ళీ వార్తలు వస్తున్నాయి. ఇక ప్రస్తుతానికి అయితే ఆమె చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు