జగన్ – చిరు భేటీలో వినోద పన్ను పై చర్చ జరిగిందా ?

Published on Oct 15, 2019 1:03 am IST

సీఎం జగన్‌తో మెగాస్టార్‌ చిరంజీవి ఈ రోజు భేటీ అయిన విషయం తెలిసిందే. చిరంజీవి దంపతులను జగన్ దంపతులు సాదరంగా ఆహ్వానించారు. మెగాస్టార్ కి శాలువా కప్పి బొబ్బిలి వీణను బహుకరిస్తూ చిరంజీవిని జగన్ సన్మానించారు. అనంతరం మెగాస్టార్ ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా విశేషాలను జగన్‌ కి వివరిస్తూ.. సినిమాని చూడాలని మెగాస్టార్ సీఎంను కోరారు.

అయితే వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత ఆయన్ను చిరు కలవనుండటం ఇదే తొలిసారి కావడంతో ఈ మీటింగ్ రాజకీయ, సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. కాగా ఈ సమావేశంలో ఎలాంటి రాజకీయ ఉద్దేశ్యం లేదట, ‘సైరా’ చిత్రానికి స్పెషల్ షోలకు అనుమతి ఇచ్చినందుకుగాను కృతఙ్ఞతలు తెలిపటానికే మెగాస్టార్ జగన్ ను కలిశారట.

అయితే ఈ సమావేశం సందర్భంగా సైరా మూవీ వినోద పన్ను పై చిరంజీవి జగన్‌ తో చర్చించినట్లు తెలుస్తోంది. ఇక ముఖ్యమంత్రి త్వరలోనే సైరా సినిమాను వీక్షించనున్నారని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :

X
More