‘రామాయణ’లో మెగా హీరోలు ఎంతమందుంటారు ?

Published on Jul 13, 2019 1:00 am IST

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మరొక ఇద్దరు నిర్మాతలు మధు మంతెన, నమిత్ మల్హోత్రాలు కలిసి ‘రామాయణ’ అనే భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కోసం దేశవ్యాప్తంగా అన్ని పరిశ్రమల నుండి నటీ నటుల్ని తీసుకుంటున్నారు. అయితే అల్లు అరవింద్ ప్రధాన నిర్మాత కాబట్టి మెగా కాంపౌండ్ హీరోలు ఎవరైనా సినిమాలో ఉంటారా అనే సందేహం వ్యక్తమవుతోంది ప్రేక్షకుల్లో.

ఎందుకంటే మెగా కాంపౌండ్‌లో పౌరాణిక చిత్రాలకు సరిపోగల, అలాంటి సినిమాల్లో నటించాలనే ఆశ ఉన్న నటులున్నారు. పైగా రామాయణం అంటే బోలెడన్ని పాత్రలుంటాయి. వాటికి ఎక్కువమంది నటులే అవసరమవుతారు. కాబట్టి మెగా హీరోలు కూడా కొందరు సినిమాలో నటించవచ్చేమోనని అనుకుంటున్నారు చాలామంది. మరి వాళ్ళు అనుకుంటున్నట్టు మెగా హీరోలు సినిమాలో నటిస్తారో లేదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

నితీశ్ తివారీ, రవి ఉద్యవార్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా మూడు భాగాలుగా ఉండనుంది. అది కూడా త్రీడీ ఫార్మాట్లో కావడం విశేషం. మొదటి భాగాన్ని 2021 నాటికి ప్రేక్షకులకు అందివ్వాలనుకుంటున్నారు నిర్మాతలు.

సంబంధిత సమాచారం :

X
More