‘వారణాసి’ పార్ట్ 1, 2 టైటిల్స్ ఇలా డివైడ్ చేసారా!?

‘వారణాసి’ పార్ట్ 1, 2 టైటిల్స్ ఇలా డివైడ్ చేసారా!?

Published on Jan 31, 2026 9:00 AM IST

Varanasi

ప్రస్తుతం ప్రపంచ సినిమా ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ఇండియన్ సినిమా ఏదన్నా ఉంది అంటే అది వారణాసి (Varanasi) అని చెప్పాలి. దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో చేస్తున్న ఈ హై బడ్జెట్ యాక్షన్ డ్రామా ఒకో అనౌన్స్మెంట్ తో పాన్ వరల్డ్ లెవెల్ హైప్ ని సెట్ చేసుకుంటుంది. రీసెంట్ గానే సినిమా గ్రాండ్ రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు. అయితే ఈ సినిమా కూడా రెండు భాగాలుగా ఉంటుంది అని ఆమధ్య టాక్ వచ్చింది.

ఇప్పుడు దానికి తగ్గట్టే రెండు భాగాలకు రెండు టైటిల్స్ లాక్ అయినట్లు తెలుస్తోంది. బాహుబలి లానే పార్ట్ 1 కి ‘వారణాసి: గ్లోబ్ ట్రాటర్’ అలాగే  పార్ట్ 2 కి వారణాసి: టైం ట్రాటర్ గా లాక్ చేసారా అన్నట్లు వినిపిస్తోంది. మొన్న వచ్చిన పోస్టర్ లో కేవలం గ్లోబ్ ట్రాటర్ ఉంది. కానీ దీనికి ముందు టైటిల్ గ్లింప్స్ లో రెండూ ఇచ్చారు. ఇపుడు ఒకటే ఇవ్వడంతో పార్ట్ 1 కి ఈ టైటిల్ పార్ట్ 2 టైం ట్రాటర్ పెట్టారా అంటూ ఓ వెర్షన్ వైరల్ అవుతుంది. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

తాజా వార్తలు