నాని ప్లానింగ్‌ను తారుమారు చేసిన ‘ది ప్యారడైజ్’

నాని ప్లానింగ్‌ను తారుమారు చేసిన ‘ది ప్యారడైజ్’

Published on Jan 31, 2026 2:00 AM IST

paradise

న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న ‘ది ప్యారడైజ్'(The Paradise) చిత్రంపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఈ సినిమాను శ్రీకాంత్ నెక్స్ట్ లెవెల్‌లో రూపొందిస్తున్నాడని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. అయితే, ఈ చిత్ర షూటింగ్ ఆలస్యం కావడంతో నాని ప్లాన్స్ అన్నీ తలకిందులయ్యాయి.

సాధారణంగా బ్రేక్ ఎక్కువగా తీసుకోకుండా సినిమాలు చేసే నాని, ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనుల జాప్యం వల్ల కొన్ని వారాల పాటు ఖాళీగా ఉండాల్సి వచ్చింది. దర్శకుడు ఈ చిత్రాన్ని చాలా భారీ స్థాయిలో ప్లాన్ చేస్తుండటంతో మేకింగ్ కోసం అనుకున్న దానికంటే ఎక్కువ సమయం పడుతోంది. ఈ జాప్యం కారణంగా ‘ది ప్యారడైజ్’ విడుదల తేదీ కూడా మారింది. వాస్తవానికి మార్చిలో రావాల్సిన ఈ సినిమా, షూటింగ్ ఇంకా పెండింగ్‌లో ఉండటంతో ఇప్పుడు జూన్ 25న విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. మే నాటికి షూటింగ్ పనులు పూర్తి కావచ్చని సమాచారం.

‘ది ప్యారడైజ్’ ఆలస్యం ప్రభావం సుజీత్ దర్శకత్వంలో నాని చేయాల్సిన ‘బ్లడీ రోమియో’ ప్రాజెక్టుపై కూడా పడింది. ఈ ఏడాది ప్రారంభంలోనే మొదలవ్వాల్సిన ఈ మూవీ షూటింగ్ ఇప్పుడు ఆరు నెలలు వెనక్కి వెళ్ళింది. దీనివల్ల 2026 క్రిస్మస్‌కు రావాల్సిన ‘బ్లడీ రోమియో’, ఇప్పుడు 2027 వేసవిలో విడుదలయ్యే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు