ఈ హిట్ కాంబినేషన్ సూపర్ హిట్ కొడుతుందా ?

Published on Dec 15, 2019 11:31 pm IST

‘గీత గోవిందం’తో భారీ విజయాన్ని నమోదు చేశాడు పరుశురామ్. ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్ళను సాంధించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఈ చిత్రం. దాంతో పరుశురామ్ తరువాత సినిమా పై ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. చాలా టైం తీసుకుని స్క్రిప్ట్ రెడీ చేసుకున్న పరుశురామ్, తన తరువాత సినిమాని నాగచైతన్యతో ప్లాన్ చేశాడు. మజిలీ, వెంకీ మామ చిత్రాలతో వరుస సూపర్ హిట్స్ ను అందుకున్న చైతు – పరశురామ్ కాంబినేషన్ లో రానున్న ఈ సినిమా పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని తెలుస్తోంది.

కాగా స్టార్ ప్రొడ్యూసర్స్ రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ సినిమాని 14 రీల్స్ ప్లస్ బ్యానర్ లో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్నారు. నాగ చైతన్య 20 వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమాకి సంబంధించి ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. ఇక ఇటు డైరెక్టర్ అటు హీరో హిట్ ట్రాక్ లో ఉండటంతో ఈ హిట్ కాంబినేషన్ సూపర్ హిట్ కొడుతుందా అని నెటిజన్లను కామెంట్లు చేస్తున్నారు. మరి పరశురామ్ ఈ సారి కూడా సూపర్ హిట్ కొడతారేమో చూడాలి.

సంబంధిత సమాచారం :

X
More