“ఆచార్య” టీజర్ లో ఈ స్పెషల్ అంశం ఉంటుందా..?

Published on Jan 23, 2021 7:01 am IST

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో “ఆచార్య” అనే హై బడ్జెట్ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఎన్నో విశేషాలుతో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రం నుంచి టీజర్ పై గత కొంత కాలం నుంచి టాక్ వినిపిస్తోంది. మరి ఆ టాక్ ప్రకారమే మేకర్స్ ఈ టీజర్ ను వచ్చే జనవరి 26కి ప్లాన్ చేస్తున్నారని టాక్ వచ్చింది.

కానీ ఇంకా అయితే ఎలాంటి అధికారిక క్లారిటీ రాలేదు. మరి ఇదిలా ఉండగా ఒకవేళ టీజర్ వస్తే ఓ స్పెషల్ అంశం ఉంటుందా ఉండదా అన్నది ప్రశ్నగా మారింది. అదే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అపీరెన్స్ కోసం. ఇటీవలే సెట్స్ లో అడుగు పెట్టిన చరణ్ కూడా ఇందులో ఉంటాడా ఉండడా అన్నది ఆసక్తికరంగా మారింది.

మరి దీనిపై క్లారిటీ రావాలి అంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే. ఇక ఈ భారీ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. అలాగే మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More