బాలయ్య కి జోడిగా ఈ స్టార్ హీరోయిన్ ఫిక్సా.?

Published on Jul 9, 2021 10:02 am IST

ప్రస్తుతం నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా మాస్ దర్శకుడు బోయపాటి శ్రీనుతో హ్యాట్రిక్ సినిమాగా ప్లాన్ చేసిన మరో సాలిడ్ మాస్ మసాలా ఎంటర్టైనర్ “అఖండ”. అలాగే ఈ సినిమా తర్వాత దర్శకుడు గోపీచంద్ మలినేనితో కూడా ఒక భారీ ప్రాజెక్ట్ ని సెట్ చేశారు. వీరితో పాటుగా అనీల్ రావిపూడితో సినిమా ఫిక్స్ అయ్యింది.

అయితే ఈ రెండు కాకుండా మరో దర్శకుడు శ్రీవాస్ తో ఓ సినిమా ఉందని నుంచో టాక్ ఉంది. మరి ఈ సినిమాకి ప్రముఖ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ బాలయ్య సరసన హీరోయిన్ గా లాక్ అయ్యినట్టు తెలుస్తుంది. మరి ఇది వరకే బాలయ్య మరియు శ్రీవాస్ ల కాంబోలో “డిక్టేటర్” అనే సినిమా వచ్చి సంక్రాంతి రేస్ లో మంచి హిట్ అయిన సంగతి తెలిసిందే.. మరి ఈ సినిమాపై మరింత సమాచారం రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :