అట్లీతో ఐకాన్ స్టార్.. ఎందుకు లేటు..?

అట్లీతో ఐకాన్ స్టార్.. ఎందుకు లేటు..?

Published on Mar 1, 2025 9:00 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను థియేటర్లకు క్యూ కట్టేలా చేసింది. ఇక అల్లు అర్జున్ నట విశ్వరూపానికి బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల మోత మోగింది. అయితే, ఇప్పుడు అల్లు అర్జున్ తన నెక్స్ట్ చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు.

గతంలో అల్లు అర్జున్ తన నెక్స్ట్ చిత్రం త్రివిక్రమ్‌తో ఉంటుందని తెలిపారు. కానీ, కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ ఆలస్యం కానుంది. దీంతో తమిళ డైరెక్టర్ అట్లీతో బన్నీ ఓ సినిమా చేయాల్సి ఉంది. ఇప్పుడు అందరూ ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం ఖాయమని అంటున్నారు. అయితే, ఈ సినిమా అనుకున్న దానికంటే ఎక్కువ ఆలస్యం అవుతుంది. దీనికి బడ్జెట్ ముఖ్య కారణంగా తెలుస్తోంది.

ఈ సినిమాను గీత ఆర్ట్స్ – సన్ పిక్చర్స్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేయాలని నిర్ణయించుకున్నాయట. అయితే, ఇప్పుడు వారు అంచనా వేసిన బడ్జెట్ కంటే ఎక్కువ అవుతుండటంతో ఈ సినిమా ఆలస్యం అవుతుందని తెలుస్తోంది. మరి నిజంగానే ఈ సినిమా ఆలస్యానికి బడ్జెట్ ముఖ్య కారణమా..? అనేది తెలియాలంటే అధికారికంగా మేకర్స్ క్లారిటీ ఇచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు