ఓటిటిలో “బేబి” తమిళ్ వెర్షన్ ఇందుకే రాలేదా?

Published on Oct 3, 2023 10:01 am IST

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆనంద్ దేవరకొండ హీరోగా మరో యంగ్ సెన్సేషన్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా దర్శకుడు సాయి రాజేష్ తెరకెక్కించిన రీసెంట్ ఎమోషనల్ లవ్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రమే “బేబి”. మరి మంచి బజ్ నడుమ రిలీజ్ అయ్యి మేకర్స్ పెట్టుకున్న నమ్మకాన్ని మించిన పెద్ద హిట్ అయ్యిన ఈ సినిమా ఆనంద్ సహా సినిమాలో వర్క్ చేసిన అందరి కెరీర్ లో కూడా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

ఇక ఈ సినిమా తెలుగు వెర్షన్ ఓటిటి లో వచ్చి కూడా రికార్డు రెస్పాన్స్ అందుకోగా ఈ సినిమా తమిళ్ వెర్షన్ కూడా ఓటిటి లో వస్తుంది అనే రూమర్స్ కి నిర్మాత ఎస్ కె ఎన్ క్లారిటీ ఇచ్చాడు. అయితే ఈ చిత్రం ఎందుకు తమిళ్ వెర్షన్ లో రాలేదు అంటే ఈ సినిమా తమిళ్ రీమేక్ సన్నాహాలు జరుగుతున్నాయి అని అందుకే రాలేదు అనే టాక్ ఇప్పుడు వైరల్ గా మారింది. అంతే కాకుండా తమిళ్ వెర్షన్ ని కూడా దర్శకుడు సాయి రాజేష్ నే తమిళ సినీ నటీనటులతో చేస్తున్నారని బజ్ మొదలైంది. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :