“టక్ జగదీష్” టార్గెట్ ఫిక్స్ చేసుకున్నాడా.?

Published on Jul 14, 2021 7:32 pm IST

నాచురల్ స్టార్ నాని హీరోగా రీతూ వర్మ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “టక్ జగదీష్”. ఈ చిత్రాన్ని నాని హిట్ దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన సంగతి కూడా తెలిసిందే. అటు మాస్ ఇటు క్లాస్ అలాగే టోటల్ ఫ్యామిలీ ఆడియెన్స్ లో కూడా మంచి హైప్ ను ఈ చిత్రం నెలకొల్పుకుంది. అయితే ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం గత ఏప్రిల్ నెలలోనే విడుదల కావాల్సి ఉండగా కరోనా రెండో వేవ్ మూలాన అది కాస్తా వాయిదా పడింది.

అలా ఆ గ్యాప్ లోనే ఎన్నో ఓటిటి ఆఫర్స్ వచ్చినా కూడా మేకర్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ చిత్రాన్ని థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తామని స్టిక్ అయ్యి ఉన్నారు. అలా ఎట్టకేలకు మళ్ళీ ఇప్పుడు థియేటర్స్ ఓపెన్ కానుండడం, కరోనా తీవ్రత తగ్గుతుండగా రిలీజ్ కి రెడీ చేస్తున్నట్టు టాక్ నడుస్తుంది.

మరి అందులో భాగంగానే ఈ జూలై నెల 30న రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు జరుగుతున్నాయని సినీ వర్గాల్లో కొన్ని రోజులు నుంచి టాక్ ఉండగా టక్ జగదీష్ టార్గెట్ నిజంగానే అప్పటికి ఫిక్స్ అయ్యింది అని బలమైన టాక్ బయటకి వచ్చింది. మరి దీనిపై మేకర్స్ ఏదైనా అధికారిక క్లారిటీ ఇస్తారేమో చూడాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా, షైన్ స్క్రీన్ ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :