తమిళ్ లో డబ్ అవుతున్న ఉప్పెన…డైరెక్ట్ ఓటిటియేనా?

Published on Jul 6, 2021 12:27 pm IST

తెలుగు నాట సంచలనం సృష్టించిన ప్రేమ కథా చిత్రమ్ ఉప్పెన. ఈ చిత్రం లో తొలిసారిగా వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి కలిసి నటించారు. ఈ చిత్రానికి బుచ్చిబాబు సన దర్శకత్వం వహించారు. అయితే ఈ ముగ్గురికి కూడా ఈ చిత్రం తొలి సినిమా నే. అయితే దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఈ చిత్రాన్ని మరొక లెవెల్ కి తీసుకు పోయింది అని చెప్పాలి. అయితే ఈ చిత్రం పై తాజాగా ఒక వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది.

తమిళ్ లో ఈ చిత్రాన్ని డబ్ చేసి డైరెక్ట్ ఓటిటి గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా తో అటు వైష్ణవ్ తేజ్, ఇటు కృతి శెట్టి లు ఎన్నో అవకాశాలను అందుకుంటున్నారు. బుచ్చి బాబు సన సైతం మరిన్ని చిత్రాలకు దర్శకత్వం వహించేందుకు సిద్దం అవుతున్నారు. అయితే ఈ చిత్రం తమిళ్ లో డబ్ తో ఆగిపోతుందా లేక రీమేక్ చేస్తారా అన్న విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :