“వకీల్ సాబ్” కూడా ఇలా వచ్చేస్తుందా.?

Published on Apr 22, 2021 6:10 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా నివేతా థామస్, అంజలి మరియు అనన్య నాగళ్ళలు కీలక పాత్రల్లో నటించిన లేటెస్ట్ చిత్రం “వకీల్ సాబ్”. మూడేళ్ళ తర్వాత పవన్ నుంచి వచ్చిన చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలు సెట్టయ్యాయి. బాలీవుడ్ హిట్ చిత్రం “పింక్” కు రీమేక్ గా దీనిని శ్రీరామ్ వేణు తెరకెక్కించారు. అయితే ఇక ఆల్ మోస్ట్ ఈ చిత్రం థియేట్రికల్ రన్ కు ముగింపు పలుకుతుంది.

ఓ పక్క కోవిడ్ కేసులు పెరుగుతుండడంతో వసూళ్లు బాగా డ్రాప్ అవుతున్నాయి. అయితే మరి ఆ మధ్య వకీల్ సాబ్ స్ట్రీమింగ్ పై మేకర్స్ క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు పరిస్థితులు వేగంగా మారుతుండడంతో మరీ లేట్ గా కాకుండా కాస్త ముందుగా ప్రైమ్ వీడియోలోకి వస్తుందేమో అన్న టాక్ మొదలయ్యింది. అయితే దీనిపై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు సో టాక్ నిజమయ్యే ఆస్కారం తక్కువే అని చెప్పాలి. మరి ఈ చిత్రం ఎప్పుడు స్ట్రీమింగ్ కు వస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :