విజయ్ ఈ మెగా ఆఫర్ ను ఒప్పుకుంటాడా..?

విజయ్ ఈ మెగా ఆఫర్ ను ఒప్పుకుంటాడా..?

Published on Jul 8, 2020 11:09 PM IST


ఇప్పుడు మన తెలుగులో ఉన్న యువ హీరోల్లో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి సినిమాతో సెన్సేషన్ అయిన విజయ్ విజయపజయాలతో దూసుకెళ్లిపోతున్నాడు. ఇప్పుడు మాస్ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియన్ సినిమా తెరకెక్కిస్తుండగా..

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నటించే ఆఫర్ వచ్చింది అని తెలిసింది. చిరు ఇప్పుడు నటిస్తున్న “ఆచార్య” అనంతరం చేయబోయే లుసిఫర్ రీమేక్ లో పృథ్వి రాజ్ రోల్ కు విజయ్ పేరు వినిపించింది. కానీ విజయ్ ప్రస్తుతం తన పాన్ ఇండియన్ ఫిల్మ్ లో బిజీ గా ఉన్నాడు. దీనితో విజయ్ నిర్ణయం ఏమిటి అన్నది తెలియ రాలేదు. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు విజయ్ దేవరకొండ లాక్ డౌన్ లో ఓ సరికొత్త లుక్ ను ప్రిపేర్ చేస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు