మీరు ఇస్మారైతే… ఇస్మార్ట్ శంకర్ ను కలవొచ్చు.

Published on May 17, 2019 8:31 am IST

మీరు రామ్ పోతినేని వీరాభిమానా…? ఆయన్ని కలిసే ఒక్క ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నారా…? ఐతే మీకో గుడ్ న్యూస్. “ఇస్మార్ట్ శంకర్” మూవీ టీం మీకో కాంటెస్ట్ కండక్ట్ చేస్తోంది. అదేంటంటే రీసెంట్గా విడుదలైన రామ్ నటించిన ఇస్మార్ట్ శంకర్ టీజర్ లోని మీకు నచ్చిన డైలాగ్ టిక్ టాక్ వీడియో చేసి పంపితే చాలు. మీరు కనుక ఆ వీడియో లో “ఇస్మార్ట్ శంకర్” టీమ్ ని ఇంప్రెస్ చేయగలిగితే రామ్ ని కలిసే ఆ గోల్డెన్ ఛాన్స్ మీరు పట్టేసినట్లే. మరింకెందుకు ఆలస్యం స్మార్ట్ ఫోన్ తీసుకొని మీ లోని నటుడ్ని నిద్ర లేపండి.
పూరి కనెక్ట్స్ బ్యానర్ లో పూరి జగన్నాథ్ డైరక్షన్లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరో గా నటిస్తున్న మూవీ “ఇస్మార్ట్ శంకర్” ప్రమోషన్ లో భాగం గా చిత్ర యూనిట్ ఈ కాంటెస్ట్ నిర్వహిస్తుంది. హీరోయిన్ ఛార్మి నిర్మాణ భాగస్వామిగా ఉన్న ఈ మూవీలో రామ్ సరసన నిధి అగర్వాల్, నాభా నటేష్ నటిస్తుండగా మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More