ఇస్మార్ట్ శంకర్ క్లైమాక్స్ ట్విస్ట్ అదిరిపోతుందట !

Published on Feb 17, 2019 4:00 am IST

డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ,ఎనర్జిటిక్ హీరో రామ్ కలయికలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’ . ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ చిత్రంతో పూరి ఎలాగైనా హిట్ కొడతాడని టాక్ వస్తుంది. అందుకు కారణం లేకపోలేదు. సినిమాలో రామ్ క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా వుంటుందట. దానికి తోడు క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ అదిరిపోనుందట. పూరి తెరకెక్కించిన ‘పోకిరి’ లో కూడా ఈ రెండు విషయాలే బాగా వర్క్ అవుట్ అయ్యాయి. సో పూరి ఈసారి ఈ ఇస్మార్ట్ శంకర్ తో స్ట్రాంగ్ గా కం బ్యాక్ కానున్నాడన్నమాట. ఇక ఓ భారీ విజయం కోసం ఎప్పటినుండో ఎదురుచూస్తున్న రామ్ ,పూరిని , కథను నమ్మి సెట్స్ లో బాగా కష్టపడుతున్నాడు. మరి ఈ ఇద్దరికి ఈచిత్రం బ్రేక్ ఇస్తుందో లేదో చూడాలి.

యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈచిత్రంలో నాబా నటేష్ , నిధి అగర్వాల్ కథానాయికలుగా నటిస్తుండగా మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం మే లో విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :