ఇస్మార్ట్ శంకర్ ఖాతాలో మరో రికార్డు

Published on Feb 19, 2020 12:13 am IST

దర్శకుడు పూరి జగన్నాధ్ హీరో రామ్ లను పరాజయాల నుండి గట్టెక్కించిన మూవీ ఇస్మార్ట్ శంకర్. అవుట్ అండ్ అవుట్ ఊర మాస్ మూవీగా వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. గత ఏడాది విడుదలైన ఈ చిత్రం 75కోట్లకు పైగా వరల్డ్ వైడ్ గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇస్మార్ట్ శంకర్ విజయంతో రామ్ మరియు పూరీలు ఫార్మ్ లోకి వచ్చారు. నభా నటేష్, నిధి అగార్వల్ హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీని పూరి కనెక్ట్స్ బ్యానర్ లో ఛార్మి, పూరి నిర్మించారు. కాగా ఇటీవలే ఈ చిత్ర హిందీ డబ్బింగ్ వర్షన్ విడుదలైంది.

యూట్యూబ్ లో ఇస్మార్ట్ శంకర్ హిందీ వర్షన్ దుమ్ములేపుతుంది. విడుదలైన 24గంటల్లో 20మిలియన్ వ్యూస్ దాటివేసిన ఈ చిత్రం 5 లక్షల లైక్స్ సాధించింది. 24గంటల్లోనే 5 లక్షల లైక్స్ సాధించి ఫస్ట్ సౌత్ డబ్బింగ్ మూవీగా నిలిచింది. దీనితో ఇస్మార్ట్ శంకర్ మూవీ హిందీ డబ్బింగ్ వర్షన్ మరిన్ని రికార్డ్స్ క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక రామ్ ప్రస్తుతం కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న రెడ్ మూవీలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో రామ్ మొదటిసారి డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. రెడ్ తమిళ హిట్ మూవీ తాడం కి తెలుగు రీమేక్.

సంబంధిత సమాచారం :