యమ స్పీడ్ గా ఇస్మార్ట్ శంకర్ షూటింగ్ !

Published on Mar 4, 2019 10:00 pm IST

ఎనర్జిటిక్ స్టార్ రామ్ , డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కలయికలో తెరకెక్కుతున్నచిత్రం ఇస్మార్ట్ శంకర్. ఇటీవల ఈ చిత్రం మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకోగా ప్రస్తుతం రెండవ షెడ్యూల్ గోవా లో శరవేగంగా జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో స్టంట్ మాస్టర్ రియల్ సతీష్ నేతృత్వంలో రామ్ , తదితరులపై యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ , నాబా నటేష్ కథానాయికలుగా నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

ఇక ఈ చిత్రంలో రామ్ లుక్ డిఫ్రెంట్ గా ఉండనుంది. పూరి జగన్నాథ్ , ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నఈచిత్రం మే లో విడుదలకానుంది. ఇక ఇంకా ఈ సినిమా షూటింగ్ పూర్తి కాకముందే ఇటీవల ఈచిత్రానికి సీక్వెల్ ను ప్రకటించి ఆశ్చర్య పరిచాడు పూరి.

సంబంధిత సమాచారం :