రెండవ రోజు కూడా “ఇస్మార్ట్ శంకర్” వసూళ్ల ప్రభంజనం.

Published on Jul 20, 2019 11:12 am IST

“ఇస్మార్ట్ శంకర్” చిత్రంతో పూరి జగన్నాధ్ మళ్ళీ ఫార్మ్ లోకి వచ్చాడనిపిస్తుంది. సినిమా చూసిన ప్రతివారు పూరి ఈజ్ బ్యాక్ అంటున్నారు. “ఇస్మార్ట్ శంకర్” మొదటి షో నుండే పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని,మంచి విజయాన్ని సాధిస్తుందన్న నమ్మకాన్ని మేకర్స్ లో కలిగేలా చేసింది. హీరో రామ్ కి కూడా చాల కాలం తరువాత మంచి హిట్ దక్కింది అని అంటున్నారు. పూరి మార్క్ హీరోయిజం కి రామ్ ఎనర్జీ తోడవ్వడంతో సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బాగా పేలింది.

వసూళ్ల పరంగా కూడా ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. మొదటి రోజు ఆశ్చర్యకరంగా 7.83 కోట్ల షేర్ సాధించిన ఈ చిత్రం రెండవ రోజు కూడా అంచనాలకు మించిన వసూళ్లు సాధించింది. రెండవరోజు రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి 4.28కోట్ల వసూళ్లతో నిలకడగా ఉంది. ఈవారం చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేకపోవడం, సుధీర్గమైన వారాంతం ఈ మూవీకి కలిసొచ్చే అంశం. ఇప్పటికే కొన్ని ఏరియాలలో డిస్ట్రిబ్యూటర్ లు లాభాలలోకి ప్రవేశించారని సమాచారం. ఈ వారాంతం చివరికి ఇస్మార్ట్ శంకర్ 20కోట్ల షేర్ రాబట్టే అవకాశం ఉందని అంచనా.

రెండు తెలుగు రాష్ట్రాలలో ఇస్మార్ట్ శంకర్ రెండవ రోజు షేర్

నైజాం-రూ. 1.96 కోట్లు

సీడెడ్ _రూ. 0.7కోట్లు

ఉత్తరాంధ్ర -రూ.0.52కోట్లు

ఈస్ట్ -రూ.0.29కోట్లు

వెస్ట్ -రూ.0.21కోట్లు
కృష్ణ -0.25కోట్లు
గుంటూరు-0.24కోట్లు
నెల్లూరు-రూ.0.12కోట్లు

రెండు తెలుగు రాష్ట్రాలలో రెండవ రోజు మొత్తం షేర్ రూ. 4.28కోట్లు

సంబంధిత సమాచారం :

X
More