టాకీ పార్ట్‌ ను పూర్తి చేసిన ‘ఇస్మార్ట్ శంకర్’ !

Published on May 12, 2019 12:27 pm IST

హీరో రామ్ – పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనెర్ ‘ఇస్మార్ట్ శంకర్’ టాకీ పార్ట్‌ ను పూర్తి చేసుకుంది. ఇక మిగిలిన నాలుగు సాంగ్స్ కి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయితే మొత్తం సినిమా షూటింగ్ పూర్తవ్వనుంది. కాగా రామ్‌ పుట్టిన రోజు సందర్భంగా మే 15న ఇస్మార్ట్ శంకర్‌ టీజర్‌ ను రిలీజ్ చేసి.. అదే రోజు నుండి ఈ చిత్రం ప్రమోషన్స్ ను కూడా ప్రారంభించాలని ప్లాన్ చేస్తోంది చిత్రబృందం.

ఈ సినిమాలో రామ్ సరసన నిధి అగర్వాల్, నాబా నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ పూర్తిగా డిఫ్రెంట్ బాడీ లాంగ్వేజ్ తో కనిపించనున్నాడు. ఇక ఈ చిత్ర విజయం పూరికి అలాగే రామ్ కెరీర్ కి కీలకం కానుంది. పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని జూలై లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

సంబంధిత సమాచారం :

More