టీజర్ తో ఆకట్టుకుంటున్న ‘ఇస్మార్ట్ శంకర్’ !

Published on May 15, 2019 10:38 am IST

ఎనర్జిటిక్ హీరో రామ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో రాబోతున్న ‘ఇస్మార్ట్ శంకర్’ నుండి తాజాగా టీజర్ రిలీజ్ అయింది. టీజర్ చూస్తుంటే సినిమా పక్కా యాక్షన్ ఎంటర్టైనెర్ గా తెరకెక్కుతుందని అర్ధమవుతుంది. ‘నీయమ్మ అరేయ్’.. అంటూ మొదలయిన టీజర్ లో మొత్తానికి రామ్ న్యూ లుక్ లో మరియు న్యూ మాడ్యులేషన్ లో ముఖ్యంగా హిందీ పదాలకు తన శైలి మార్క్ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు.

అలాగే టీజర్ ప్రధానంగా ‘నేపధ్య సంగీతంతో పాటు.. బ్యాగ్రౌండ్ సాంగ్ కూడా చాలా బాగుంది. మెయిన్ గా రామ్ నోట్లో మందు బాటిల్ పెట్టుకుని సాంగ్ లో వేసిన స్టెప్ ట్రైలర్ కే హైలెట్ గా నిలుస్తోంది. ఇక టీజర్ లో పూరి మార్క్ క్యారెక్టరైజేషన్.. పూరి మార్క్ డైలాగ్సే ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

ఈ సినిమాలో రామ్ సరసన నిధి అగర్వాల్, నాబా నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

సంబంధిత సమాచారం :

More