‘ఇస్మార్ట్ శంకర్’ ట్రైలర్ 2 : ఇది కదా అసలు సిసలు పూరి స్టైల్

Published on Jul 12, 2019 5:47 pm IST

కొన్ని రోజుల క్రితం పూరి జగన్నాథ్ కొత్త చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’ ట్రైలర్ విడుదలైంది. హడావుడి ఎక్కువగా ఉన్న ఆ ట్రైలర్ మాస్ ప్రేక్షకులకి నచ్చింది కానీ క్లాస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. మొత్తానికి ట్రైలర్ పూర్తిస్థాయిలో సక్సెస్ అందుకోలేదనే అనాలి. కానీ ఇప్పుడు రిలీజ్ చేసిన రెండవ ట్రైలర్ మాత్రం మొదటి దానిలా తికమకగా కాకుండా కిర్రాక్ అనేలా ఉంది.

ఇందులోనే హీరో క్యారెక్టర్ ఎక్కువగా రివీల్ అయింది. రామ్ డైలాగ్ డెలివరీ స్టైల్, నటన, కొత్తగా ఉన్న సంభాషణలు, భిన్నమైన పాత్ర చిత్రీకరణ చూస్తే ‘పోకిరి’లో పండుగాడి క్యారెక్టర్ ఎలాగైతే పేలిందో ఈ సినిమాలో ‘ఇస్మార్ట్ శంకర్’ పాత్ర అలానే పేలుతుందని అనిపిస్తోంది. ఇక ఇద్దరు హీరోయిన్లతో హీరో రొమాన్స్, ఫుల్ ఎనర్జీ నిండిన రామ్ స్టెప్స్, మణిశర్మ మ్యూజిక్ అన్నీ కలిసి ఈ ట్రైలర్‌ను మొదటి ట్రైలర్ కంటే ఎన్నో రెట్లు బెటర్‌గా చేశాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది కదా అసలు సిసలు పూరి స్టైల్ అనేలా ఉంది ట్రైలర్.

ట్రైలర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :

More