రెండు రోజుల్లోనే సగం రాబడతాడట ‘ఇస్మార్ట్ శంకర్’

Published on Jul 18, 2019 5:00 pm IST

తెలుగులో సాలిడ్ మాస్ సినిమా వచ్చి చాలా రోజులే అయింది. ఈమధ్య వచ్చినవన్నీ చాలావరకు కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలే. దీంతో మాస్ ప్రేక్షకులు నీరసించిపోయారు. వారికోసమే ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా తీశారు పూరి జగన్నాథ్. భారీ అంచనాల నడుమ సినిమా ఈరోజే విడుదలైంది. ఇన్నాళ్లు పక్కా కమర్షియల్ సినిమా కోసం మొహం వాచిన మాస్ ప్రేక్షకులు థియేటర్లకు పోటెత్తారు.

దాదాపు అన్ని ఏరియాల్లో హౌజ్ ఫుల్ అయ్యాయి థియేటర్లు. కొన్నిచోట్ల మొదటిరోజే ఓపెనింగ్స్ రూపంలో దాదాపు 30 శాతం పెట్టుబడి వెనక్కి వస్తుందని, ఇంకొన్ని చోట్ల రెండు మూడు రోజుల్లో సగం రికవరీ పూర్తవుతుందట. ఇక ఈరోజు వచ్చిన మిక్స్డ్ టాక్ మెరుగుపడితే చిత్రం కమర్షియల్ సక్సెస్ కావడం చాలా సులభం అంటున్నారు. మొత్తానికి చాన్నాళ్లుగా సక్సెస్ చూడని పూరి జగన్నాథ్, రామ్ ఈ చిత్రంతో బౌన్స్ బ్యాక్ కానున్నారన్నమాట.

సంబంధిత సమాచారం :