మాల్దీవ్స్‌ లో నిధి అగ‌ర్వాల్‌ తో `ఇస్మార్ట్ శంక‌ర్‌` !

Published on Jun 14, 2019 11:30 pm IST

హీరో రామ్ – పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనెర్ ‘ఇస్మార్ట్ శంకర్’ టాకీ పార్ట్ చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. ప్ర‌స్తుతం సినిమాలో ఓ రొమాంటిక్ సాంగ్‌ను రామ్‌, నిధి అగ‌ర్వాల్‌ ల‌ పై మాల్దీవుల్లో చిత్రీక‌రిస్తున్నారు. భాస్క‌ర భ‌ట్ల ర‌చించిన `లవ్‌` సాంగ్‌ను మాల్దీవుల్లోని అంద‌మైన లొకేష‌న్స్‌లో ఈ పాట‌ను చిత్రీక‌రిస్తుండ‌టం విశేషం. మ‌ణిశ‌ర్మ ఈ చిత్రానికి సంగీత సారథ్యం వ‌హిస్తున్నారు.

రీసెంట్‌ గా విడుద‌లైన టీజ‌ర్‌కు, దిమాక్ ఖ‌రాబ్ అనే సాంగ్‌ కు ప్రేక్ష‌కుల నుండి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను జూలై 12న విడుద‌ల చేయ‌డానికి ద‌ర్శ‌క నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు.

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేశ్ హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం `ఇస్మార్ట్ శంకర్‌’. డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌కుడు. పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్ ప‌తాకాల‌ పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More