మిర్చి షూటింగ్ సెట్ లో ఇస్మార్ట్ శంకర్ !

Published on Jan 26, 2019 3:41 pm IST


పూరి -రామ్ కలయికలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. ఇటీవల ఈచిత్రం యొక్క షూటింగ్ హైదరాబాద్ లో ప్రారంభమైంది. ప్రస్తుతం ఈచిత్రం సలీం హౌజ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. విచిత్రం ఏంటంటే ప్రభాస్ నటించిన సూపర్ హిట్ మూవీ ‘మిర్చి’ కూడా మొదటి రోజు షూటింగ్ కూడా అక్కడే జరిగింది. మరిఆ చిత్రంలాగే ఈసినిమా కూడా సూపర్ హిట్ అవుతుందో లేదో చూడాలి.

ఇక ఈలాంగ్ షెడ్యూల్ ఫిబ్రవరి 21వరకు జరుగనుంది. ఏప్రిల్ లో ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసి మే లో ఈ చిత్రాన్ని విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో సత్య దేవ్ ,ఆశిష్ విద్యార్ధి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈచిత్రానికి ఇంకా హీరోయిన్ ను ఖరారు చేయలేదు.

సంబంధిత సమాచారం :