హీరో నాని ని కూడా వదలని ఐటీ అధికారులు

Published on Nov 20, 2019 1:05 pm IST

నేటి ఉదయమే టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్స్ లో ఒకరైన సురేష్ బాబుపై ఐటీ దాడులు నిర్వహించిన అధికారులు హీరో నాని ని కూడా టార్గెట్ చేశారని తెలుస్తుంది. ఇప్పుడే అందిన సమాచారం ప్రకారం నాని నివాసం మరియు కార్యాలయాలపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారట. వరుసగా సినీ ప్రముఖులను టార్గెట్ చేస్తున్న ఐటీ అధికారులు ఆంతర్యం ఏమిటో ఎవరికీ అంతుబట్టడం లేదు.
హీరోగా వరుస సినిమాలు చేస్తున్న నాని, నిర్మాతగా కూడా సినిమాలు తీస్తున్నాడు. గతంలో కాజల్ ప్రధాన పాత్రలో ‘అ’ అనే ప్రయోగాత్మక చిత్రం తెరకెక్కించిన నాని, లేటెస్ట్ గా విశ్వక్ సేన్ హీరోగా ఓ మూవీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక ఆయన హీరోగా ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వి’ చిత్రీకరణ జరుపుకుంటుంది. వచ్చే ఏడాది మార్చి 25న ఉగాది కానుగ మూవీ విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :

More