అఫీషియల్..”రాధే శ్యామ్” తెలుగు రన్ టైం రివీల్.!

Published on Mar 6, 2022 4:39 pm IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ భారీ చిత్రం “రాధే శ్యామ్”. దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కించిన ఈ బిగ్ బడ్జెట్ విజువల్ ట్రీట్ మరికొన్ని రోజుల్లో థియేటర్స్ లో బిగ్గెస్ట్ ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధం అవుతుంది. అయితే ఇంకా ఈ సినిమా రిలీజ్ లోపు దీని తాలూకా రన్ టైం పై పలు ఊహాగానాలు వైరల్ అవుతూ వచ్చాయి.

కానీ ఇప్పుడు ఫైనల్ గా రాధే శ్యామ్ తెలుగు వెర్షన్ కి సంబంధించి రన్ టైం ఇప్పుడు రివీల్ అయ్యిపోయింది. ఈ చిత్రం తెలుగులో రెండు గంటల 18 నిమిషాలు నిడివి లాక్ అయ్యినట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. దీనికి సంబంధించి సెన్సార్ సర్టిఫికెట్ కూడా ఇపుడు బయటకి వచ్చి వైరల్ అవుతుంది. మొత్తానికి అయితే ఒక రెండున్నర గంటల పాటు రాధే శ్యామ్ అనే ఒక కొత్త లోకం లోకి అంతా వెళ్లడం అధికారికంగా క్లారిటీ వచ్చేసింది అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :