శ్రావణ శుక్రవారం వేళ పండంటి ఆడబిడ్డ పుట్టింది !

Published on Aug 9, 2019 7:50 pm IST

మంచు ఫ్యామిలీలోకి శ్రావణ శుక్రవారం వేళ వరలక్ష్మీ వ్రతం నాడే లక్ష్మీదేవి రూపంలో పండంటి ఆడబిడ్డ అడుగు పెట్టింది. వివరాల్లోకి వెళ్తే మంచు విష్ణు సతీమణి విరోనికా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ వార్తకు సంబంధించి స్వయంగా మంచు విష్ణునే తన ట్విటర్‌ ద్వారా తన అభిమానులతో మరియు ప్రేక్షకులతో పంచుకున్నారు. విష్ణు దంపతులకు ఇప్పటికే ముగ్గురు పిల్లలు వివియానా, అరియానా, అవ్రామ్‌లు ఉన్న సంగతి తెలిసిందే.

అయితే విష్ణు దంపతులకు పలువురు సినీ ప్రముఖులతో పాటు మంచు ఫ్యామిలీ అభిమానులు అలాగే ప్రేక్షకులు శుభాకాంక్షలు చెబుతున్నారు. ‘వరలక్ష్మీ వ్రతం నాడు ఆడపిల్ల పుట్టింది కాబట్టి ఆ లక్ష్మీదేవినే మీ ఇంట అడుగుపెట్టినట్టే. ఇక పై మీకు అన్నీ శుభాలే’ అని అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

సంబంధిత సమాచారం :