పవన్ గ్రాండ్ రీ ఎంట్రీ కి సర్వం సిద్ధం..!

Published on Dec 13, 2019 6:51 am IST

పవన్ అభిమానులకు సంక్రాంతి ముందే వచ్చేసింది. ఎట్టకేలకు పవన్ రీ ఎంట్రీ పై క్లారిటీ దొరికింది. ఆయన పింక్ మూవీ రీమేక్ చేయనున్నట్లు స్పష్టమైన ప్రకటన రావడం జరిగింది. గత కొద్దిరోజులుగా పవన్ కళ్యాణ్ హిందీ హిట్ మూవీ రీమేక్ తో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. బోనికపూర్ దిల్ రాజు నిర్మాతలుగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కనున్నట్లు ప్రచారం జరిగింది. ఐతే పవన్ సీరియస్ పొలిటిషన్ గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కొనసాగుతున్న నేపథ్యంలో ఇవి పుకార్లు మాత్రమే అని చాలా మంది అనుకున్నారు.

ఇవి పుకార్లు కాదు… త్వరలో పింక్ మూవీ సెట్స్ పైకి వెళ్లనుందని నేటి సంఘటనతో రుజువైంది. దిల్ రాజు, దర్శకుడు వేణు శ్రీరామ్ నేడు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ని కలవడంతో పాటు పింక్ రీమేక్ కొరకు మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలుపెట్టాము అని అధికారికంగా ప్రకటించారు. ఇక థమన్ కూడా నా మొదటి బిగ్ ప్రాజెక్ట్ హీరో గారితో అని ట్వీట్ చేశారు. గతంలో పవన్ తో థమన్ పని చేసింది లేదు. దీనితో వీరు హీరో పేరు ప్రకటించినప్పటికీ అది పవన్ సినిమా అన్నవిషయం స్పష్టం అవుతుంది. ఎప్పటి నుండో పవన్ కళ్యాణ్ ని వెండి తెరపై చూడలని ఆశపడుతున్న అభిమానులకు ఇది పండుగలాంటి వార్త అని చెప్పాలి. పవన్ చివరి చిత్రం 2018లో వచ్చిన అజ్ఞాతవాసి.

సంబంధిత సమాచారం :

More