ఇంటర్వ్యూ : అమ్మాయిల వైపు అలా చూడ్డం నచ్చలేదు – అనసూయ

రంగస్థలం సినిమాలో రంగమ్మ అత్తగా ప్రేక్షకులను మెప్పించిన అనసూయ ఆ పాత్రకు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ సందర్భంగా అనసూయతో ఇంటర్వ్యూ…

ప్ర) సినిమాకు రెస్పాన్స్ ఎలా ఉంది ?
జ) ముందు నాకు ఈ పాత్ర పై పెద్దగా నమ్మకం లేదు. అయితే సుకుమార్ గారు నాకు ధైర్యం చెప్పారు. సినిమా విడుదల తరువాత అందరు బాగుంది అంటున్నారు. నేను ఉహించని రెస్పాన్స్ లభించడం ఆనందంగా ఉంది.

ప్ర) అసలు ఈ సినిమాలో అవకాశం ఎలా వచ్చింది ?
జ) మొదట మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నుండి కాల్ వచ్చింది. సుకుమార్ గారు మీకు కథ చెప్పాలి అనుకుంటున్నారు అన్నారు. ఆ తరువాత డైరెక్టర్ ని కలవడం జరిగింది. ఆయన నా పాత్ర గురించి చెప్పినప్పుడు నేను చెయ్యగలనా అనుకున్నాను. ఆ తరువాత ఆయనమీద నమ్మకంతో ఒప్పుకొని చేయడం జరిగింది.

ప్ర) ఈ సినిమాకు పని చేయడం ఎలా అనిపించింది ?
జ) ఒక పెళ్లి అయిన అమ్మాయి వైపు ఆశగా చూడ్డం నచ్చలేదు, సినిమా విడుదల తరువాత అందరు నా పాత్ర గురించి మాట్లాడుకోవడం చూస్తుంటే ఆనందంగా ఉంది. సినిమా షూటింగ్ సమయంలో చాలా నేర్చుకున్నాను.

ప్ర) సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో సుకుమార్ గారు ఎలా సపోర్ట్ చేసారు ?
జ) ఆయన సపోర్ట్ లేకపోతే నేను ఈ పాత్ర ఇంతబాగా చేసేదాన్ని కాదు. ఆ క్రెడిట్ అంతా ఆయనకే ఇవ్వాలి. షూటింగ్ జరుగుతున్న సమయంలో సుకుమార్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ నాకు బాగా సహకరించారు.

ప్ర) చరణ్ తో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?
జ) షూటింగ్ సమయంలో చరణ్ నాకు బాగా సహకరించారు. నా ఫస్ట్ డే షూట్ ఒక బొట్ లో జరిగింది. ఆ సీన్ చేయడానికి నేను ఇబ్బంది పడ్డాను. అయితే చరణ్ సపోర్ట్ తో బాగా చెయ్యగలిగాను.

ప్ర) అర్జున్ రెడ్డి సినిమా ఈవెంట్ గురించి మీరు ఎందుకు రియాక్ట్ అయ్యారు ?
జ) నాకు ఎవరిపైనా వ్యక్తిగతంగా కోపం లేదు, కాని ఆ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ మాట్లాడిన మాటలకు భాధ అనిపించింది. ఒక తల్లి గురించి బ్యాడ్ గా కామెంట్స్ చెయడం నాకు నచ్చలేదు. అందుకే కామెంట్ చేసాను.

ప్ర) మీ తదుపరి సినిమాలు ?
జ) నేను నటిస్తోన్న ‘సచ్చిందిరా గొర్రె’ సినిమా 70 శాతం షూటింగ్ పూర్తి అయింది. ఈ సినిమా తరువాత రెండు పెద్ద సినిమాల్లో నటించబోతున్నాను. వాటి వివరాలు త్వరలో వెల్లడిస్తాను…