ఆఫీషియల్..చరణ్ మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ లో కియారా ఫిక్స్.!

Published on Jul 31, 2021 11:00 am IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రెండు భారీ ప్రాజెక్ట్ లు చేస్తున్న సంగతి తెలిసిందే.. మరి ఆ రెండు చిత్రాల తర్వాత చరణ్ మరో సెన్సేషనల్ పాన్ ఇండియన్ దర్శకుడు శంకర్ తో ఓ చిత్రం అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.. మరి అనౌన్స్మెంట్ చేసిన నాటి నుంచే భారీ హైప్ తెచ్చుకున్న ఈ చిత్రం ఒక్కో అప్డేట్ ను వదులుతూ మరింత లెవెల్లోకి వెళ్తుంది.

అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారు అన్నది గత కొంత కాలం నుంచి ఆసక్తికరంగా మారింది. చాలా మంది ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా పేర్లు వినిపించాయి. అయితే ఫైనల్ గా మాత్రం స్ట్రాంగ్ బజ్ ప్రకారం వినిపించిన స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ పేరే ఇప్పుడు ఫైనలైజ్ కావడం కన్ఫర్మ్ అయ్యింది.

మరి ఈ విషయాన్నీ స్వయంగా దిల్ రాజు నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వారు అధికారికంగా ఆమె బర్త్ సందర్భంగా కన్ఫర్మ్ చేసారు. శంకర్ మరియు కియారా లు చర్చించుకుంటున్న ఓ పోస్టర్ తో దీనిని తెలియజేసారు. మెగా ఫ్యాన్స్ కూడా ఈ కాంబో కోసమే ఎదురు చూస్తున్నారు. సో ఎట్టకేలకు బెంచ్ మార్క్ చిత్రంలో కియారా అద్వానీ ఫిక్స్ అయ్యింది అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :