అఫీషియల్..పవన్ – రానా చిత్రంలో నిత్య కన్ఫర్మ్.!

Published on Jul 30, 2021 11:23 am IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో క్రేజీ మల్టీ స్టారర్ చిత్రం అయ్యప్పణం కోషియం రీమేక్ కూడా ఒకటి. మాస్ లో భారీ హైప్ ను సొంతం చేసుకున్న ఈ చిత్రం షూట్ ఇటీవలే మొదలు కాగా మేకర్స్ కూడా సాలిడ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఇస్తూ వస్తున్నారు. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం లో హీరోయిన్స్ గా కూడా స్టార్ నటీమణుల పేర్లు కొన్నాళ్లుగా వినిపిస్తుండగా వాటిలో నిత్యా మీనన్ పేరు కూడా వినిపించింది.

మరి ఇప్పుడు ఎట్టకేలకు ఆమె ఈ చిత్రంలో ఉన్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. ఈరోజే అనౌన్సమెంట్ తో తమ సినిమాకి ఆమెను వెల్కమ్ చెబుతూ అధికారికంగా ప్రకటించారు. అయితే నిత్యా రోల్ పవన్ సరసన ఉండనున్నట్టు తెలుస్తుంది. అలాగే రానా కి ఐశ్వర్య రాజేష్ పేరు కూడా వినిపిస్తుంది మరి ఆమె రోల్ ఎప్పుడు రివీల్ చేస్తారో చూడాలి. ఇంకా ఈ సాలిడ్ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా త్రివిక్రమ్ మాటలు అందిస్తున్నారు. అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :