
సౌత్ ఇండియన్ బ్యూటిఫుల్ హీరోయిన్ నయనతారకి జోడీగా జేడీ చక్రవర్తి నటిస్తున్నాడా.? అవును మీరు చదివింది నిజమే.. వీరిద్దరి కలయికలో ఓ సినిమా రాబోతోంది. కానీ ఆ సినిమా మలయాళంలో రానుంది. ఇక అసలు విషయంలోకి వెళితే.. మలయాళ సూపర్ హిట్ మూవీస్ డైరెక్టర్ సిద్దిక్ దర్శకత్వంలో ‘భాస్కర్ ది రాస్కెల్’ అనే సినిమాని ప్రారంభించారు. నయనతార ప్రధాన పాత్రలో నటించనున్న ఈ సినిమాలో నయనతారకి జోడీగా జెడి చక్రవర్తిని సెలెక్ట్ చేసారు. జెడి చక్రవర్తికి ఇది తొలి మలయాళ సినిమా.
డైరెక్టర్ సిద్దిక్ చెప్పిన కథ మరియు నయనతార లీడ్ రోల్ చేస్తుందని తెలియడంతో జెడి ఈ సినిమాకి సైన్ చేసాడు. గతంలో నయనతార హీరోయిన్ గా నటించిన ‘దుబాయ్ శీను’ సినిమాలో నయనతారకి అన్నగా జెడి కనిపించాడు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. సెకండ్ ఇన్నింగ్స్ లో నయనతార తెలుగులో చేసిన సినిమా రెండే అయినా తమిళంలో మాత్రం వరుస సినిమాలతో సూపర్ హిట్స్ అందుకుంటోంది. అలానే మలయాళంలో కూడా వరుసగా సినిమాలకు సైన్ చేస్తోంది. మరి ఈ రేర్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా ఎలా ఉంటుందనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే..