పవర్‌ఫుల్‌గా ఆ క్లబ్‌లో జాయిన్ అయిన ‘జాట్’

పవర్‌ఫుల్‌గా ఆ క్లబ్‌లో జాయిన్ అయిన ‘జాట్’

Published on Apr 21, 2025 7:03 PM IST

బాలీవుడ్ హీరో సన్నీ డియోల్, టాలీవుడ్ దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కిన క్రేజీ యాక్షన్ చిత్రం ‘జాట్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తోంది. ఈ సినిమా పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా ఉండటంతో ఈ మూవీకి మాస్ ఆడియెన్స్ కనెక్ట్ అవుతున్నారు.

ముఖ్యంగా ఈ సినిమాకు నార్త్ బెల్ట్ ఆడియెన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు. అక్కడ సన్నీ డియోల్ కెరీర్ బెస్ట్ చిత్రంగా ‘జాట్’ నిలిచిందంటే, ఈ సినిమాకు అక్కడ ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమా తాజాగా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా వంద కోట్ల క్లబ్‌లోకి చేరడం విశేషం అని చెప్పాలి.

ఈ సినిమా ఇప్పటివరకు ఏకంగా రూ.102.13 కోట్ల మేర వసూళ్లు సాధించినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఇక ఈ సినిమాలో రణ్‌దీప్ హుడా, రెజీనా తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు