‘జాట్’ సాలిడ్ వీకెండ్.. మిలియన్ దాటిన బుకింగ్స్..!

‘జాట్’ సాలిడ్ వీకెండ్.. మిలియన్ దాటిన బుకింగ్స్..!

Published on Apr 19, 2025 6:00 PM IST

రీసెంట్ గా బాలీవుడ్ సినిమా దగ్గర రిలీజ్ కి వచ్చి మంచి హిట్ అయ్యిన చిత్రాల్లో నటుడు సన్నీ డియోల్ హీరోగా నటించిన సాలిడ్ మాస్ యాక్షన్ డ్రామా “జాట్” కూడా ఒకటి. టాలీవుడ్ దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ చిత్రం స్టడీ వసూళ్లతో దూసుకెళ్తుంది. ఇక ఇలా మరో వీకెండ్ లోకి రావడంతో మళ్ళీ సినిమా నార్త్ బెల్ట్ లో పుంజుకుంటున్నట్టు తెలుస్తుంది.

ఆల్రెడీ బుకింగ్స్ పరంగా కూడా జాట్ ఊపందుకోగా బుక్ మై షోలో ఈ చిత్రం ఇపుడు వరకు 1 మిలియన్ కి పైగా టికెట్స్ ని అమ్ముడుపోయినట్టుగా తెలుస్తుంది. దీనితో మేకర్స్ కూడా ఈ విషయంలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ వీకెండ్ కూడా సాలిడ్ గా ఉంటుందని ఆశిస్తున్నారు. మరి ఈ రెండు రోజుల్లో జాట్ ఎలాంటి వసూళ్లు అందుకుంటుందో చూడాలి. మరి ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ తెరకెక్కించగా దీనికి సీక్వెల్ ని కూడా లాక్ చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు