మరోసారి పెళ్లి పీటలెక్కిన రష్మీ-సుధీర్.. ఆది కూడా!

Published on Jul 10, 2021 2:39 am IST

సుడిగాలి సుధీర్, హైపర్ ఆదిలు పెళ్లికి రెడీ అయ్యారు. అవునా ఎవరిని చేసుకోబోతున్నారు అనేగా మీ సందేహం? సుధీర్ ఎప్పటిలాగానే రష్మీతో పెళ్ళి పీటలెక్కుతుండగా, హైపర్ ఆది ఏమో దీపికను చేసుకునేందుకు సిద్దమయ్యాడు. అయితే వీరి ఇద్దరి జంటల పెళ్లిల్లు రోజా, మను గార్లు ఇద్దరు దగ్గరుండి మరీ చేశారండోయ్. కానీ ఇదంతా నిజమని అనుకోకండి.. ఎందుకంటే ఈ పెళ్లిల్లు జరిగింది జబర్దస్థ్ స్కిట్‌లో భాగంగా మాత్రమే.

తాజాగా జబర్దస్థ్‌కి సంబంధించి ఓ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో సుధీర్-రష్మీ, ఆది-దీపిక జంటలు పెళ్లి చేసుకుంటున్నట్టు జరిగిన ఓ ఫన్నీ స్కిట్ భలే అనిపించింది. ఇవే కాకుండా చలాకీ చంటి, ఇమ్మాన్యుయెల్, అదిరే అభి, రాకెట్ రాఘవ, వెంకీ మంకీ టీంస్ చేసిన స్కిట్‌లు కూడా హిలేరియస్ కామెడీగా అనిపించాయి. మొత్తానికి వచ్చే వారం పండగేమి లేకున్నా జబర్దస్థ్‌లో ఓ పండగ వాతావరణం కనిపించబోతుంది. మరీ ఈ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎపిసోడ్‌ను మిస్ కాకూడదంటే వచ్చే గురువారం ఈటీవీలో వచ్చే జబర్దస్థ్‌ను చూసేయాల్సిందే. ఇక అప్పటివరకు ఈ ప్రోమో వైపు ఓ లుక్కేసుకోండి.

సంబంధిత సమాచారం :