యాత్ర ఫై జగన్ ట్వీట్ !

Published on Feb 10, 2019 10:28 am IST

దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘యాత్ర’ మొన్న విడుదలై పాజిటివ్ రివ్యూస్ ను సొంతం చేసుకొని బాక్సాఫిస్ వద్ద డీసెంట్ కలెక్షన్లను రాబడుతుంది. ఇక ఈ చిత్రం ఫై తాజాగా వైఎస్సార్ తనయుడు వైఎస్సార్ సిపి పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ట్విట్టర్ ద్వారా స్పందించారు. చిత్ర దర్శకుడు మహి వి రాఘవ్ , నిర్మాతలు విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి,శివ మేక అలాగే సినిమా యూనిట్ కు ఈసినిమాను వియవతంగా రిలీజ్ చేసినందుకు అభినందనలు. గొప్ప నాయకుడైన వైఎస్సార్ గారి పాత్రను నిబద్దతో చూపించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదలు అని జగన్ ట్వీట్ చేశారు.

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించగా జగపతి బాబు ,పోసాని , అనసూయ , సుహాసిని , ఆశ్రిత ముఖ్య పాత్రలను పోషించారు. కృష్ణ కుమార్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :