ఆ ఫోటోపై ముందుగానే క్లారిటీ ఇచ్చిన జగ్గుభాయ్..!

Published on Jul 7, 2021 1:00 am IST


మొదట్లో ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్న టాలీవుడ్ యాక్టర్ జగపతిబాబు కాలక్రమేనా విలన్‌గా మారి తనకంటూ మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే ఎప్పటికప్పుడు తన లుక్‌తో స్మార్ట్‌గా కనిపించే జగ్గు భాయ్ తాజాగా తెలుపు కుర్తా పైజామా ధరించి, చేతిలో బ్లాక్ గాగుల్స్ పట్టుకుని గోడపై కూర్చున్న స్టిల్‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.

అయితే అచ్చం ఈ ఫోటోలో జగ్గుభాయ్ డైనమిక్ పొలిటీషన్‌లా కనిపిస్తుండడంతో ఈ స్టిల్‌పై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వస్తున్నాయి. అందులోనే భాగంగా మీరు ఈ లుక్‌లో పొలిటిషియ‌న్‌లా కనిపిస్తున్నారు? పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారా? అని ఓ అభిమాని ప్రశ్నించారు. అయితే నెటిజన్లకు వస్తున్న ఇలాంటి ప్రశ్నలకు జగ్గుభాయ్ ముందుగానే స్పందిస్తూ ‘ఖ‌చ్చితంగా పొలిటిషియ‌న్‌లా ఉండాల‌నుకోవ‌డం లేదంటూ’ ఆ ఫోటోకు క్యాప్షన్ జతచేసి క్లారిటీ ఇచ్చేశాడు. ఏదేమైనా జగ్గుభాయ్ మాత్రం ఈ లుక్‌లో ఇస్మార్ట్‌గా కనిపిస్తున్నాడనే చెప్పాలి.

సంబంధిత సమాచారం :