జాన్వీను ట్రోల్‌ చేసి ఇబ్బంది పెట్టొద్దు – జగపతి బాబు

జాన్వీను ట్రోల్‌ చేసి ఇబ్బంది పెట్టొద్దు – జగపతి బాబు

Published on Jun 8, 2026 1:05 PM IST

రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా ప్రేక్షకులతో పాటు ఇటు అభిమానుల నుంచి కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అటు బాక్సాఫీస్ దగ్గర కూడా భారీ కలెక్షన్స్ ను రాబడుతుంది. ఐతే, ‘పెద్ది’ మీద తాను ప్రాణం పెట్టుకున్నట్లు జగపతిబాబు చెప్పారు. జగపతి బాబు మాట్లాడుతూ.. ‘పెద్ది’ విడుదలయ్యాక నాకు ఓ పెద్ద డైరెక్టర్‌ ఫోన్‌ చేశారు. ‘‘పెద్ది’లో మీరు చాలా గొప్ప పాత్ర చేసినా ఎందుకు ఎవరూ గుర్తించట్లేదు. అదే పాత్రను వేరే భాషకు చెందిన నటులు చేసి ఉంటే బాగా హైలైట్‌ చేసేవారు కదా’ అని నాతో అన్నారు.

ఏ ఇండస్ట్రీలో అయినా పరభాష నటులకు ఎక్కువ గౌరవం ఇస్తూ ఉంటారు. నేను కన్నడలో చేస్తే అక్కడ బాగా గౌరవిస్తారు. నేను కూడా ‘పెద్ది’ విడుదలయ్యాక బుచ్చిబాబును ఒకటే ప్రశ్న అడిగాను, షూటింగ్‌ లో నా ప్రతి షాట్‌కు క్లాప్స్‌ కొట్టారు కదా. ఇప్పుడెందుకు నా గురించి మాట్లాడట్లేదని అడిగాను. పెద్ది సినిమా కోసం నేను ప్రాణం పెట్టాను. అందుకే గుర్తింపు కోసం అడిగే హక్కు నాకు ఉంది. ఇక జాన్వీ దర్శకుడు చెప్పినట్లు చేసింది. ఈ విషయంలో నేను జాన్వీకపూర్‌కు సపోర్ట్‌ చేస్తాను. తనను ట్రోల్‌ చేసి మానసికంగా ఇబ్బంది పెట్టొద్దు’ అని జగపతి బాబు చెప్పారు.

తాజా వార్తలు