కృష్ణా జిల్లాల్లో ‘జై సింహ’ మొదటిరోజు వసూళ్లు !
Published on Jan 13, 2018 9:14 am IST

నందమూరి బాలకృష్ణ నటించిన 102వ చిత్రం ‘జై సింహ’ నిన్ననే భారీ అంచనాలు నడుమ థియేటర్లలోకి ఎంటరైంది. మొదటి షో నుండే పాజిటివ్ మౌత్ టాక్ వ్యాపించడం సినిమాకు బాగా అనుకూలించింది. అభిమానులు కూడా బాలయ్య పెర్ఫామెన్స్, సినిమా పట్ల సంతృప్తికరంగా ఉన్నారు. విడుదలైన ప్రతి చోట చిత్రం మంచి ఓపెనింగ్స్ ను రాబట్టింది.

ముఖ్యమైన కృష్ణా జిలాల్లో రూ.46.17 లక్షల షేర్ ను రాబట్టిందీ చిత్రం. రాబోయేది మూడు రోజులు పండుగ సెలవులు కావడం సినిమాకు బాగా కలిసొచ్చే అంశం కానుంది. కె.ఎస్. రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ నిర్మించగా నయనతార, హరిప్రియ, నటాషా దోషిలు ఇందులో హీరోయిన్లయిగా నటించారు.

 
Like us on Facebook