‘జైలర్ 2’ కోసం భారీ డిమాండ్.. అయినా తగ్గని మేకర్స్!

‘జైలర్ 2’ కోసం భారీ డిమాండ్.. అయినా తగ్గని మేకర్స్!

Published on Apr 23, 2025 3:00 AM IST

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జైలర్ 2’ ప్రస్తుతం కేరళలో షూటింగ్ జరుపుకుంటోంది. గతంలో వచ్చిన ‘జైలర్’ చిత్రానికి ఇది సీక్వెల్‌గా వస్తోంది. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాను పూర్తి స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దుతున్నాడు.

ఇక ఈ సినిమా షూటింగ్‌లో ఉండగానే ఈ చిత్ర రైట్స్ కోసం భారీ డిమాండ్ నెలకొన్నట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఓ బడా నిర్మాణ సంస్థ ‘జైలర్-2’ చిత్ర థియేట్రికల్ రైట్స్ కోసం అదిరిపోయే ఆఫర్ ఇచ్చిందట. ఈ స్థాయిలో ఆఫర్ రావడం.. అది కూడా సినిమా షూటింగ్‌లో ఉండగానే అంటే ఈ సినిమాకు ఎలాంటి క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.

కానీ, ‘జైలర్ 2’ మేకర్స్ మాత్రం ఈ ఆఫర్‌ను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. వారు ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యేసరికి డీల్ క్లోజ్ చేయాలని చూస్తున్నారట. మరి ‘జైలర్ 2’ చిత్ర రైట్స్ ఎలాంటి రికార్డ్‌ను సెట్ చేస్తాయో చూడాలి. ఇక ఈ సినిమాలో రమ్యకృష్ణ, యోగిబాబు, మిర్నా మీనన్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా శివ రాజ్‌కుమార్ ఓ గెస్ట్ పాత్రలో కనిపిస్తారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు