సాహో కి సవాల్ గా మరో విలన్ వచ్చాడు

Published on Aug 8, 2019 3:07 pm IST

మొదటగా నీల్ నితిన్ ముకేశ్,తరువాత అరుణ్ విజయ్,నిన్న ఛంకీ పాండే,మరియు లాల్ ఒకరి తరువాత ఒకరు సాహో పై దాడికి దిగారు. సాహో కనీసం ఉపరిపీల్చుకొనే సమయం కూడా ఇవ్వడం లేదు. కొందరు మైండ్ గేమ్ తో తికమక పెడుతుంటే, కొందరు భుజ బలంతో సవాలు విసురుతున్నారు. ఒకడు నమ్మక ద్రోహం చేసేవాడు, మరొకడు ఆకస్మికంగా మారణహోమం సృష్టించే వాడు, ఒకడు ఎంత చంపినా చావకుండా బ్రతికొస్తుంటాడు, చివరివాడు పై ముగ్గురిని కలిపితే అది వాడు. ఇలాంటి డేంజరస్ విలన్స్ సాహో ని అంతం చేయడానికి అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఒక్కొక్కడు ఒక రకం ఎవడికాడే ప్రత్యేకం.

వీరు చాలరన్నట్టు ఇవ్వాళ మరొక విలన్ జాకీ ష్రాఫ్ దిగాడు. ఈ విలన్ ని చూస్తుంటే మాస్టర్ ప్లాన్స్ వేసే మైండ్ గేమ్ విలన్ లా ఉన్నాడు. ఇతను ఎదుటోడికి ఛాయిస్ ఇవ్వడు. అతను అనుకుంటే జరగాలి. ఒప్పుకో లేదంటే చావు అనేది వీడి సిద్ధాంతం. అలాంటి డేంజర్ విలన్ వీడు.

మొత్తానికి సాహో టీం ఇప్పటివరకు ఐదుగురు విలన్స్ ని పరిచయం చేశారు. వీరిని చూస్తుంటేనే ప్రభాస్ సాహోలో ఏరేంజ్ యాక్షన్ చూపించనున్నాడో అర్థం అవుతుంది. యూ వి క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శ్రద్దా కపూర్ నటిస్తుండగా, మందిరా బేడీ, వెన్నెల కిషోర్, మురళి శర్మ, ఎవ్లీన్ శర్మ వంటి ముఖ్యతారలు నటిస్తున్నారు. ఈనెల 30న గ్రాండ్ గా విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :