వెనక్కి వెళ్ళిన అల్లరోడి ‘జేమ్స్ బాండ్’

james-bond
ఎప్పటికప్పుడు డిఫరెంట్ కామెడీ కాన్సెప్ట్స్ తో తెలుగు ప్రేక్షకులను నవ్విస్తున్న నేటితరం కామెడీ హీరో అల్లరి నరేష్. ప్రతి సినిమాతో మినిమమ్ గ్యారంటీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే అల్లరి నరేష్ నటించిన లేటెస్ట్ మూవీ ‘జేమ్స్ బాండ్’, ‘నేను కాదు, నా పెళ్ళాం’ అనేది ఈ సినిమాకి ట్యాగ్ లైన్. ‘బ్రదర్ అఫ్ బొమ్మాళి’ సినిమాతో సిస్టర్ పెట్టిన టార్చర్ తో మనల్ని నవ్వించిన అల్లరి నరేష్ ఈ సారి జేమ్స్ బాండ్ తరహా భార్యతో వచ్చే ఇబ్బందుల ద్వారా మనల్ని నవ్వించనున్నాడు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమాని జూన్ 26న రిలీజ్ చేయనున్నట్లు ఈ చిత్ర టీం ఇటీవలే అనౌన్స్ చేసింది.

కానీ ఈ చిత్ర వర్గాలు చెబుతున్న తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఈ వారం విడుదల కావడం లేదు. ఈ వారం ముగ్గురి చిన్న హీరోల సినిమాలు రిలీజ్ అవుతుండడం, ఈ టైంలో తాము కూడా రిలీజ్ చేస్తే థియేటర్స్ సమస్య వస్తుందని.. వాళ్ళకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఈ సారి సోలోగా వద్దామని ఈ చిత్ర టీం వెనక్కి వెళ్ళినట్లు సమాచారం. త్వరలోనే ఈ చిత్ర టీం మరో సరికొత్త రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయనున్నారు. అల్లరోడికి చుక్కలు చూపించే మాఫియా డాన్ వైఫ్ గా సాక్షి చౌదరి నటించింది. ఏకె ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా శ్రీను వైట్ల దగ్గర పనిచేసిన సాయి కిషోర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

Exit mobile version