‘జేబ్స్‌బాండ్’ ఆడియో రిలీజ్ డేట్ ఖరారు

‘జేబ్స్‌బాండ్’ ఆడియో రిలీజ్ డేట్ ఖరారు

Published on May 12, 2015 8:17 PM IST

James-Bond
అల్లరి నరేష్ సినిమాలంటే రెండున్నర గంటలపాటు హాయిగా నవ్వుకునే సినిమాలుగా అందరూ చెబుతుంటారు. నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ తర్వాత హాస్యకథా చిత్రాలతో ఆ స్థాయిని సొంతం చేసుకున్న హీరోగా అల్లరి నరేష్‌కు పేరుంది. తాజాగా ఆయన నటించిన సినిమా ‘జేమ్స్‌బాండ్’ విడుదలకు సిద్ధమవుతోంది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా ద్వారా సాయి కిషోర్ దర్శకుడిగా పరిచయం కానున్నారు.

సాయి కార్తీక్ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఆడియోను మే 14న విడుదల చేయనున్నారు. నిజానికి ఈ ఆడియో వేడుకను నేడే (మే 12న) నిర్వహించాల్సి ఉన్నా, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆడియో రిలీజ్‌ను మే 14వ తేదీకి వాయిదా వేశారు. ‘జేమ్స్‌బాండ్’ అనే పేరు, ‘నేను కాదు.. నా పెళ్ళాం’ అనే ట్యాగ్‌లైన్‌తో బయటకొచ్చిన ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌కే విపరీతమైన స్పందన వచ్చింది. ఇక సినిమా అంతకుమించి నవ్విస్తుందని సినిమా యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. మే నెలాఖర్లో సినిమాను విడుదల చేసేలా నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

తాజా వార్తలు