‘జన నాయగన్’ రిలీజ్ డేట్ పై మేకర్స్ మౌనం.. కారణం అదేనా..?

‘జన నాయగన్’ రిలీజ్ డేట్ పై మేకర్స్ మౌనం.. కారణం అదేనా..?

Published on Jul 11, 2026 5:14 PM IST

Jana-nayagan

తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన లాస్ట్ మూవీ ‘జన నాయగన్’ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ రావడంతో అభిమానుల్లో ఈ మూవీపై కన్ఫ్యూజన్ ఏర్పడింది. ఇక ఈ సినిమా ఎట్టకేలకు సెన్సార్ పనులు పూర్తి చేసుకుని ‘ఏ’ సర్టిఫికెట్ పొందింది. అయితే, ఈ విషయాన్ని మేకర్స్ తాజాగా ఓ సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు.

తాజాగా విడుదల చేసిన కొత్త పోస్టర్‌లో ‘ది హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు సి. జోసెఫ్’ అనే పవర్‌ఫుల్ లైన్ ఉండటంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే, మేకర్స్ ఇంకా అధికారికంగా రిలీజ్ డేట్ ప్రకటించకపోవడంతో అభిమానుల్లో కాస్త గందరగోళం నెలకొంది.

సినిమా విడుదల ఆలస్యం కావడంతో గతంలో అమెజాన్ ప్రైమ్ వీడియోతో జరిగిన ఓటీటీ డీల్ రద్దయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కొత్త ఓటీటీ భాగస్వామి కోసం వెతుకుతున్న మేకర్స్, జూలై 24ను తాత్కాలిక రిలీజ్ డేట్‌గా పరిశీలిస్తున్నారు. హెచ్. వినోద్ దర్శకత్వంలో కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో పూజా హెగ్డే, మమితా బైజు, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తుండగా, అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు