నైజాం ఏరియాలో రికార్డ్ కలెక్షన్స్ సాధించిన జనతా గ్యారేజ్
Published on Sep 2, 2016 12:57 pm IST

janatha-garage-2
కొరటాల శివ, ఎన్టీఆర్ ల కలయికలో రూపొందిన ‘జనతాగ్యారేజ్’ చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలై ప్రేక్షకులు, విమర్శకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుని మొదటిరోజు రికార్డ్ ఓపెనింగ్ కలెక్షన్లను సాధించింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం నిన్న ఒక్కరోజే నైజాం ఏరియాలో రూ.5. 51 కోట్ల రూపాయల షేర్ సాధించింది.

నైజాం ఏరియాలో ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు విడుదల చేశారు. అలాగే ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ వారాంతంలో వరుస సెలవులు ఉండటంతో కలెక్షన్లు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కూడా అన్ని ఏరియాల్లో పెట్టుబడులు దాదాపుగా వచ్చేశాయని, డిస్ట్రిబ్యూటర్లు హ్యాపీగా ఉన్నారని తెలిపింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్, మోహన్ లాల్ ల నటన, కొరటాల శివ ఎమోషన్ ను క్యారీ చేసిన విధానం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి.

 
Like us on Facebook